ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరోసారి ఎండ, వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో భూ ఉపరితలం నుంచి గాలులు వాయుగుండం దిశగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో ఎండలు పెరిగాయి. సత్యసాయి జిల్లా మడకశిరలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం రాయలసీమలో పలు చోట్ల అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని హెచ్చరించింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో వైపు తెలంగాణలోనూ ఉష్ణోగత్రలు గరిష్టంగా నమోదువుతున్నాయి. హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల నాలుగో వారం వరకు ఇదే రకంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)