షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అనిత అనే చీరల వ్యాపారికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్​తో నాలుగు లక్షలు విలువ చేసే చీరలు, ఇంటి గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇంటిపై నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన గమనించి నీటితో మంటలను ఆర్పీ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలా కాకుండా ఇంటిలో నిద్రించి ఉంటే ప్రాణం నష్టం జరిగి ఉండేదని బాధిత మహిళ తెలిపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమవుతుంటే విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని బాధిత మహిళ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)