హైదరాబాద్ నుంచి గోవా టూర్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 May 2023

హైదరాబాద్ నుంచి గోవా టూర్ !


గోవాలో అందమైన బీచ్‌లతో పాటు చర్చిలు, క్యాసినోలు, రిసార్ట్‌లు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. గోవా వెళ్లే పర్యాటకులకు తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ టూ గోవా పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోండగా ప్రతి సోమవారం ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్, వాగేటర్ బీచ్ తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. ప్రతి సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ నుంచి గోవాకు బస్సు అందుబాటులో ఉంది. మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. బషీర్‌బాగ్ నుంచి మధ్యాహ్నం 2:00 గంటలకు బస్సులో ప్రయాణం మొదలవుతుంది. (రాత్రి భోజనం ఉంటుంది. రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది.  రెండో రోజు ఉదయం 6 గంటలకు గోవాలోని హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్)కు చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం ఉదయం 10.00 గంటల నుంచి నార్త్ గోవాలోని మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్ ల సందర్శన ఉంటుంది. రాత్రి భోజనం, హోటల్‌లో బస ఉంటుంది. మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత సౌత్ గోవాలోని డోనా పౌలా బీచ్, మిరామార్, పాత గోవా చర్చిలు, మంగూషి దేవాలయాలు, కొల్వా బీచ్, మార్డోల్ బీచ్ సందర్శనకు వెళ్తారు. అదే రోజు సాయంత్రం సొంత ఖర్చుతో క్రూజ్ బోట్‌లో జర్నీఉంటుంది( ఒక్కొక్కరికి రూ.500). తర్వాత తిరిగి హోటల్ కి చేరుకుంటారు. నాలుగో రోజు హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్) నుంచి ఉదయం 11.00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. 5వ రోజు ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది. సింగిల్ షేరింగ్ కు రూ. 14, 900 ధర ఉండగా, అడల్ట్స్‌కు రూ. 9,900 ధరగా ప్రకటించారు. చిన్నారులకు రూ.7,920గా ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. 

No comments:

Post a Comment