ఐస్‎క్రీమ్ ధర రూ.5 లక్షలు !

Telugu Lo Computer
0


జపాన్ ‎కు చెందిన ఓ ఐస్‎క్రీమ్ తయారీదారు ఖరీదైన ఐస్‎క్రీమ్‎ను తయారు చేశారు. దీని పేరు సిలాటో. ఐస్‎క్రీమ్‎ను పూర్తిగా బైకుయా అనే ప్రోటీన్ ‎తో తయారు చేశారట. అందుకే ఇది ఇంత ధర పలుకుతోందని తయారీదారులు చెబుతున్నారు. అందుకే ఈ ఐస్‎క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‎క్రీమ్ ‎గా పేరు సంపాదించుకుంది. సాధారణ ఐస్‌క్రీమ్‌‎లు తయారు చేసినట్లే ఈ ఐస్‌క్రీమ్‌‎ను పాలతోనే తయారు చేస్తారు. కానీ ఇది వెల్వెట్‎లా ఉంటుంది. ఈ ఐస్‎క్రీమ్ తయారీ కోసం చీజ్, గుడ్డులోని పచ్చ సోన , పర్మిజియానో ​​చీజ్, వైట్ ట్రఫుల్, ట్రఫుల్ ఆయిల్, గోల్డ్ లీఫ్‌ కలుపుతారని తెలుస్తోంది. ఈ ఐస్‌క్రీమ్‌ ప్యాకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక స్టైలిష్ బ్లాక్ బాక్స్‌లో దీనిని ప్యాక్ చేస్తారు. ఇది చూడటానికి సాధారణ ఐస్‎క్రీమ్ ‎లానే ఉన్నా, తినటానికి ఉపయోగించే స్పూన్ చేతితో తయారు చేసిన మెటల్ కావడం విశేషం. ఈ స్పూన్ ‎కు కూడా ప్రత్యేకత ఉంది. టోక్యో హస్తకళాకారులు ఈ స్పూన్ ‎ను ప్రత్యేకంగా తయారు చేశారు. 130 ఎంఎల్ క్వాంటిటీలో ఉండే ఈ ఐస్‎క్రీమ్ ధర అక్షరాలా 8,80,000 యెన్స్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5 లక్షల కంటే ఎక్కువే. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)