అపార్థంతో చెల్లెలి ప్రాణం తీసిన అన్న! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 9 May 2023

అపార్థంతో చెల్లెలి ప్రాణం తీసిన అన్న!


మహారాష్ట్రలోని థానే నగరంలోగల ఉల్హాస్‌నగర్ లో ఓ 12 ఏళ్ల బాలిక తన అన్న, వదినలతో కలిసి జీవిస్తోంది. చిన్న వయసులోనే కన్నవాళ్లను కోల్పోవడంతో అన్నావదినలే ఆమె ఆలనాపాలనా చూస్తున్నారు. కానీ, ఈ భూమ్మీదకు వచ్చే అందరు ఆడబిడ్డల్లాగే తను కూడా పెద్దమనిషి కావడం ఆ బాలిక పాలిట శాపమయ్యింది. చెల్లెలి దుస్తులపై రక్తపు మరకలు చూసిన అన్న ఆమెను అనుమానించాడు. ఎవరితోనే శారీరకంగా కలవడంతోనే అలా జరిగిందని కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న పట్టుకారు కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు. ముఖం, కాళ్లు, చేతులు, వీపు ఇలా ఎక్కడ పడితే అక్కడ కాల్చి చిత్రవధ చేశాడు. దాంతో బాలిక పరిస్థితి విషమించింది. దాంతో ఇరుగుపొరుగుతో కలిసి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆడబిడ్డ పెద్దమనిషి అయితే ఎవరైనా పండుగలా వేడుక జరుపుకుంటారు. కానీ, తోడబుట్టిన వాడి మూర్ఖత్వంతో పెద్దమనిషి అయినందుకు ఓ అమాయకురాలు అసువులు బాసింది. 

No comments:

Post a Comment