రూ.64.15 లక్షల ప్యాకేజీని అందుకున్న రైతు బిడ్డ !

Telugu Lo Computer
0


తమిళనాడులోని ఒక చిన్న రైతు కుటుంబానికి చెందిన ఆర్ రమ్య   అనే యువతి ఓ సింగపూర్‌ కంపెనీ గ్రూప్‌లో భారీ ఉద్యోగ ఆఫర్‌ పొందింది. ఈ టాలెంటెడ్ స్టూడెంట్ ఐఐఎం సంబల్‌పూర్  ప్లేస్‌మెంట్‌లో రూ.64.15 లక్షల ప్యాకేజీకి ఎంపికైంది. ప్రతిష్ఠాత్మకమైన తోలారం గ్రూప్ రమ్య సామర్థ్యాన్ని గుర్తించి, ఆమెకు తగిన ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. రమ్యకు నైజీరియాలో పనిచేసే అవకాశాన్ని అందించింది. ఒక చిన్న గ్రామం నుంచి గ్లోబల్ పవర్‌హౌస్‌లో పెద్ద జాబ్‌ వరకు ఆమె ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమైనది. రమ్య తమిళనాడులోని సేలం జిల్లాలో పుట్టి పెరిగింది. ఆమె అద్భుతమైన మేనేజ్‌మెంట్, అనలైటికల్ స్కిల్స్ కారణంగా అత్యంత కష్టమైన 5-6 రౌండ్ల ఇంటర్వ్యూలు పాస్ కాగలిగింది. చివరికి తోలారం గ్రూప్‌లో ఉద్యోగం సంపాదించింది. ఆమె టాలెంట్ చూసి కంపెనీ యాజమాన్యం రికార్డు స్థాయిలో ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో రమ్య మాట్లాడుతూ తమ గ్రామంలోని మహిళలు సాధారణంగా చదువుల కోసం బయటకు వెళ్లరని, అయితే తనలాంటి మహిళలు ఉన్నత చదువులు చదివేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)