ఒకే వ్యక్తి పేరు మీద 684 సిమ్లు !

Telugu Lo Computer
0


ముంబైలోని టెలికాం విభాగం ఏకంగా 30,000 సిమ్‌ కార్డు లను డియాక్టివేట్ చేసింది. ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లతో ఫోర్జరీ చేసి తీసుకున్న సిమ్‌ కార్డులను డీయాక్టివేట్ చేసింది. మూడు రోజుల క్రితం భారీ ఫేక్ సిమ్‌ రాకెట్‌ ను పోలీసులు గుర్తించారు. ఒకే వ్యక్తి పేరుమీద వందలాది సిమ్ కార్డులు ఉన్నట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన టెలికాం విభాగం ఫేక్ పేర్లు, ఐడీ కార్డులతో తీసుకున్న సిమ్ కార్డులను గుర్తించి 30,000 సిమ్‌ కార్డు లను డియాక్టివేట్ చేసింది. సిమ్ కార్డు కోసం ఇచ్చిన ఐడీ కార్డులను ఫోర్జరీ చేసి వీటిని తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 62 గ్రూపుల్లో 8,247 మంది సబ్ స్క్రైబర్లను గుర్తించారు. ఒక ముఠాగా ఏర్పడి ఇలా ఫేక్ సిమ్ కార్డులను తీసుకున్నారు. టెలికాం శాఖ చేపట్టిన దర్యాప్తులో ఒకే వ్యక్తి పేరు మీద 684 సిమ్ కార్డులు తీసుకున్నట్లు తేలింది . దీంతో ముంబైలోని మలబార్ హిల్, వీపీ మార్గ్, డీబీ మార్గ్, డీఎన్ నగర్, సహర్, బంగూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)