కేరళ బోటు ప్రమాద బాధితులకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా

Telugu Lo Computer
0


కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ తీరంలో పర్యాటకుల బోటు బోల్తా పడింది. నిన్న రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సంఖ్యపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాద సమయంలో చాలా మంది మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. వీరికోసం రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేరళ సీఎం పినరయి విజయన్ కలిశారు. తిరురంగాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితులను సీఎం విజయన్ పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఓ విషాదం, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం పినరాయి విజయన్ చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు 12 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా సీఎం విజయన్ పరామర్శించారు. వారి బాధ వర్ణణాతీమని, ఈ విషాద ఘటన తనను ఎంతో బాధించిందని ఆయన వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)