వయసు 36 - జీతం 30,000 - ఆస్తులు రూ.7 కోట్లు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లో అవినీతి నిరోధక అధికారులు జరిపిన దాడుల్లో 36 సంవత్సరాల హేమా మీనా అనే ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి చిట్టా చూస్తే నోరెళ్ల బెట్టవలసి వస్తుంది. మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు ఇన్ ఛార్జి అసిస్టెంట్ ఇంజనీర్ గా  పదేళ్లుగాఉద్యోగం చేస్తుంది. 5 నుంచి 7 లగ్జరీ కార్లు, 20 వేల చదరపు అడుగుల స్థలం, 30 లక్షలు ఖరీదు చేసే టీవీ, 24 గిర్ జాతికి చెందిన పశువులు, ఇంకా 100 కుక్కలు, మొబైల్ జామర్లు, విలువైన వస్తువులు ఈ లిస్టులో ఉన్నాయి. ఖరీదైన వస్తువులతో పాటు తన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన వస్తువులు కూడా ఈమె ఉపయోగించినట్లు తెలుస్తోంది. హార్వెస్టర్లతో పాటు కొన్ని వ్యవసాయ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేసే నెపంతో లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ బృందం హేమా మీనా ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించింది. కేవలం ఒకే రోజులో రూ. 7 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు బయట పెట్టారు. హేమపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)