ఇమ్రాన్ ఖాన్కు తాత్కాలిక బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో బెయిల్ మంజూరైంది. ఇమ్రాన్ అరెస్ట్ చట్టవ్యతిరేకమని గురువారం సుప్రీం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు రెండు వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ను భారీ భద్రత నడుమ అధికారులు హైకోర్టులో హాజరుపరిచారు. భద్రతాకారణాల వల్ల విచారణ  రెండు గంటలు ఆలస్యమైంది. ఇమ్రాన్ హైకోర్టుకు వచ్చే సమయంలో ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇమ్రాన్ ఖాన్పై పదికి పైగా అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ తన అరెస్టు కొనసాగితే అప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం అవుతాయని ఇమ్రాన్ హెచ్చరించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ను ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే కోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేయడంపై ఆ దేశ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. మరోవైపు ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్ అరెస్ట్తో పాకిస్థాన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు రాజధానితో సహా కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పలుచోట్ల ఆర్మీ కార్యాలయాలు లక్ష్యంగా దాడులు చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఆయనకు మద్దతుగా శ్రీనగర్ హైవే జీ-13పై ఆందోళనలు జరిగాయి. రాళ్లరువ్వారు, దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)