ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 May 2023

ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం


రాజస్థాన్‌లో వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం సోమవారం హనుమాన్‌ఘర్ సమీపంలో బహ్లోల్‌నగర్‌లో ఓ ఇంటిపై కుప్పకూలింది. కూలడానికి ముందే అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూరత్‌గఢ్‌ నుంచి మిగ్- 21 యుద్ధ విమానం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పైలట్‌కు గాయాలయ్యాయని, పైలట్ కోసం వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 పంపటంతో అతన్ని చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. ఇంటిపై మిగ్ -21 కూలడంతో ఆ సమయంలో అక్కడ ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

No comments:

Post a Comment