200 కేజీల కేక్ కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర పుణెలోని పింప్రి చించ్వాడ్‌లో నివాసం ఉండే ప్రాచీ దహబల్‌ దేబ్‌ అనే మహిళ రకరకాల ఆకృతులతో కేకులు తయారు చేస్తారు. రీసెంట్ గా 200 కిలోల భారతీయ రాజభవనం నమూనాను తయారు చేశారు. రాయల్ ఐసింగ్ అనే విధానంలో ఆమె తయారు చేసిన ఈ కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. రాయల్ ఐసింగ్ అనేది ప్రత్యేకమైన కళ అట. బ్రిటన్ రాజ కుటుంబం కోసం తయారు చేసే కేకుల్ని అందంగా అలంకరించడానికి కూడా రాయల్ ఐసింగ్‌ను ఉపయోగిస్తారట. ఈ కళలో మెళకువలు నేర్చుకోవడం కోసం ప్రాచీ లండన్ వెళ్లారట. ఇందులో ప్రావీణ్యం సంపాదించిన ఆమె తాజాగా ప్రపంచ రికార్డును సాధించారు. అన్నట్లు ప్రాచీ ఈ కేకులు తయారీ 11వ ఏటనుంచి మొదలు పెట్టారట. గతంలో మిలాన్‌ కేథడ్రల్‌ మోడల్‌లో 100 కేజీల కేకును తయారు చేసి ప్రాచీ రికార్డు కొల్లగొట్టారు. అంతేకాదు అత్యధికంగా వీగన్ రాయల్ ఐసింగ్‌తో కేకులు రూపొందించిన ప్రపంచ రికార్డు కూడా ప్రాచీ పేరు మీదనే ఉండటం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)