14 విమానాలు దారి మళ్లింపు !

Telugu Lo Computer
0


బెంగళూరులో వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ల్యాండ్‌ అవ్వాల్సిన 14 విమానాలను చెన్నైకు మళ్లించారు. గురువారం సాయంత్రం నుంచి బెంగుళూరులో వర్షం కురుస్తోంది. రాత్రి 10.25 గంటలకు కొల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో విమానం, 10.35 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం, 10.40 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానం, 10.55 గంటలకు చెన్నై నుంచి వెళ్లిన ఏయిర్‌ ఏసియా విమానం, 11.05 గంటలకు చెన్నై నుంచి వెళ్లిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానాలు ల్యాండ్‌ అయ్యే పరిస్థితులు లేక గాల్లో చక్కర్లు కొట్టాయి. అలాగే, కౌలాలంపూర్‌, హాంకాంగ్‌ సహా పలు నగరాల నుంచి వచ్చిన మొత్తం 14 విమానాలు వాతావరణం అనుకూలించక చెన్నైకు పంపారు. చెన్నై విమానాశ్రయంలో లాం్యడ్‌ అయిన విమానాల్లో ప్రయాణికులను ఉంచి, ఆయా సంస్థల సిబ్బంది ఆహారం, తాగునీరు అందించారు. అదే సమయంలో చెన్నై విమానాశ్రయానికి విదేశాల నుంచి వచ్చే విమానాలు ల్యాండ్‌ కావాల్సి ఉండడం, రన్‌వే సమీపంలో 14 విమానాలుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్‌ రూమ్‌, లోడర్‌ సిబ్బందిని అదనంగా నియమించి విధులు నిర్వహించారు. అనంతరం బెంగుళూరులో వాతావరణం అనుకూలించడంతో అర్ధరాత్రి 1 గంటకు పైన ఒక్కొక్క విమానం చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరి బెంగుళూరు వెళ్లాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)