మహారాష్ట్రలో అన్నదాతకు ఏటా రూ.12,000

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 'నమో షెట్కారీ మహాసన్మాన్ యోజన' కింద రాష్ట్రంలోని కోటి మంది రైతులకు ఏటా రూ.6,000 చెల్లిస్తుంది. ఇంతే మొత్తంలో మరో రూ.6,000 కేంద్ర అందించాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 పొందుతారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతా లోకి జమ అవుతాయి. సమావేశానంతరం క్యాబినెట్ నిర్ణయాన్ని షిండే మీడియా ముందు ప్రకటించారు. ''ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం నిర్ణయం తీసుకున్నాం. రైతులకు ఏటా రూ.6,000 ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతే మొత్తంలో రైతులకు ఏటా రూ.6000 ఏటా అందిస్తుంది'' అని షిండే తెలిపారు. కాగా, కోటి మందికి పైగా రైతులు ఇందువల్ల లబ్ధి పొందుతారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఆర్థిక మంత్రిగా కూడా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ 2023-24 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)