కారుకు ప్రమాదంలో 11 మంది మృతి

Telugu Lo Computer
0


చత్తీస్ గఢ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సహా మొత్తం 11 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బొలేరో వాహనంలో బంధువుల పెండ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ధమతరి జిల్లాకు చెందిన కుటుంబం బుధవారం బొలేరో వాహనంలో కాంకేర్ జిల్లాలో పెండ్లికి బయలుదేరింది. నేషనల్ హైవే 30పై పూరూర్ దగ్గరికి చేరుకోగానే బొలేరోను ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బొలేరో మొత్తం ధ్వంసమైంది. అందులో ఉన్న 10 మంది స్పాట్​లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో జరిగిందని పూరూర్ ఎస్సై అరుణ్ కుమార్ సాహు గురువారం తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ట్రక్కును స్పాట్ లోనే వదిలేసి డ్రైవర్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. యాక్సిడెంట్ కు కారణం ఏంటన్నది ఇంకా తెలియదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఈ ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది, మరొకరు మరణించడం బాధాకరం. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)