రూ.4.5కోట్ల నగదు పట్టివేత !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండటంతో డబ్బు, మద్యం ప్రవాహం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల కొనుగోలుకు విల్లాలో సిద్ధం చేసిన రూ.4.5కోట్లను కోలార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వతేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పంచడానికి ఓ రియల్టర్ గన్నీ బ్యాగుల్లో నగదును కారులో తీసుకువచ్చారని అందిన సమాచారం మేర పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు.రమేష్ యాదవ్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్న ఈ విల్లాలో పోలీసుల దాడి చేసిన సమయంలో ఎవరూ లేరు. పోలీసు బృందం వెంట ఎన్నికల పరిశీలకుడు కూడా ఉన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక కర్ణాటక రాష్ట్రంలో రూ.331 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.117 కోట్ల నగదు, రూ.85.53 కోట్ల బంగారం, రూ.78.71 కోట్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)