ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులకు 10 మంది మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వడదెబ్బతో రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10 మంది కన్నుమూశారు. ఆదివారం నాటితో పోలిస్తే మంగళవారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం మినహా మిగిలిన కోస్తా జిల్లాలన్నింటిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైకి చేరాయి.. బుధవారం కూడా రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అప్రమత్తం చేసింది. . వడదెబ్బతో ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో వి.ప్రసాదరావు (65), జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో పుట్టా శంకర్‌రెడ్డి (62) చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన రైతు పేడాడ సింహాచలం (63), తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు బంగ్లాతోట గిరిజన కాలనీవాసి, వ్యవసాయ కూలీ పైడి కస్తూరయ్య (50) వడదెబ్బతో కన్నుమూశారు. బాపట్ల మండలం పిన్నిబోయినవారిపాలేనికి చెందిన కూలీ బి.రమణయ్య (55) చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు చలమాల కోటేశ్వరరావు (75), కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కూనపురెడ్డి చలపతి (103) ఎండ ధాటికి కన్నుమూశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడపూడికి చెందిన కూలీ ఆర్‌.శ్రీనివాసరావు (40), తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు వాసి చెప్పుల సామేలు (55) కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు మండలం కౌతవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పి.శివనాగరాజు (45) మృతిచెందారు

Post a Comment

0Comments

Post a Comment (0)