భార్య చనిపోయిన చోటే భర్త ఆత్మహత్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యాంసుందర్‎కి హుస్నాబాద్ కు చెందిన శారదతో గతేడాది మే 15న పెళ్లైంది. కానీ పలు కారణాల వల్ల ఎనిమిది నెలల క్రితం భార్య శారద తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. శ్యాంసుందర్‎కి 65 ఏళ్ల తల్లి బొల్లంపల్లి కనకలక్ష్మి, తండ్రి కనకయ్యతో పాటు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. భార్య చనిపోవడంతో శ్యాంసుందర్ మనస్థాపానికి గురయ్యాడు. పెళ్లి రోజు సమీపిస్తుండటంతో దాని కంటే ఒక రోజు ముందు  భార్య ఆత్మహత్య కు పాల్పడిన చోటే అతడూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అతడి మృతి పట్ల తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుమారుడు కళ్లముందే విగత జీవిగా కనిపించడాన్ని తట్టుకోలేకపోయింది. సోమవారం సొంత ఊరికి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం సోమవారం రాత్రి సమయంలో తల్లి కనకలక్ష్మికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె మరణించింది. కొంత కాలం వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో ఊరిలో విషాదం నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)