మన్‎ కీ బాత్ వినలేదని విద్యార్ధులకు రూ.100 జరిమానా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 6 May 2023

మన్‎ కీ బాత్ వినలేదని విద్యార్ధులకు రూ.100 జరిమానా !


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జీఆర్‌డీ నిరంజనాపూర్‌ అకాడమీ ఆఫ్‌ డెహ్రాడూన్‌ పాఠశాల యాజమాన్యం .ఏప్రిల్ 30న జరిగిన ప్రధానమంత్రి మన్‎ కీ బాత్  స్పీచ్ వినలేదని విద్యార్థులకు రూ.100 ఫైన్ వేసింది. జరిమానా చెల్లించకుంటే మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలని నోటీసులు ఇచ్చి మరీ ఒత్తిడి చేస్తోంది. విద్యార్ధులకు జరిమానా విధిచడం ఏమిటంటూ విద్యార్థుల తల్లితండ్రలు మానవ హక్కుల సంఘం నేతలను ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన సంఘం అధ్యక్షుడు విద్యార్ధులకు విధించిన ఫైన్ గురించి తెలుపుతూ ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. అంతే కాదు స్కూల్ యాజమాన్యం విద్యార్ధులకు పంపిన నోటీసుల స్క్రీన్ షాట్స్‎ ను షేర్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై హయ్యర్ అఫీషియల్స్ చర్యలు తీసుకోవాలని ఆరిఫ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు , జీఆర్‌డీ నిరంజనాపూర్‌ అకాడమీ ఆఫ్‌ డెహ్రాడూన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వని పక్షంలో విద్యార్ధుల నుంచి డబ్బును వసూలు చేసినట్లు భావించి తదనుగునంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments:

Post a Comment