ఆరోగ్యకరమైన అల్పాహారం ఏంటి ?

Telugu Lo Computer
0


ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాట్‌ జీపీటీ' హవా నడుస్తోంది. ఇది ఓ కొత్తతరం సెర్చ్‌ ఇంజిన్‌. ఈ టూల్‌తో మాట్లాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి చాట్ జీపీటీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. శరీరానికి శక్తిని అందించే పోషకాలు అధికంగా ఉండే ఆహారమే ఆరోగ్యకరమైన అల్పాహారం అని సమాధానం ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం కొన్ని సూచనలు చేసింది. తృణధాన్యాలతో తయారు చేసిన రొట్టెలు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకోవాలని సూచించింది. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయని పేర్కొంది. అదేవిధంగా గుడ్లు, పెరుగు, చీజ్‌తో పాటు గింజలు/విత్తనాలు వంటి ప్రోటీన్ పదార్థాలను అల్పాహారంలో చేర్చుకోవాలని తెలిపింది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం వివిధ రకాల పండ్లు, కూరగాయలను అల్పాహారంలోకి చేర్చుకోవాలని సూచించింది. బెర్రీలు, అరటిపండ్లు, అవకాడో, బచ్చలికూర లేదా టమోటాలు బ్రేక్ ఫాస్ట్ మెనూలో చేర్చుకోవాలని తెలిపింది. వీటితోపాటు గింజలు, వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని పేర్కొంది. ప్రతి రోజూ అల్పాహారం సమయంలో పాలు లేదా పాలపదార్థాలు ఉండేలా చూసుకోవాలని చాట్‌ జీపీటీ సూచించింది. మిల్క్‌ ప్రాడక్ట్స్‌ను ఇష్టపడని వారు నాన్‌ డైరీ పదార్థాలు బాదం పాలు, కొబ్బరి పాలు లేదా సోయా మిల్క్‌ తీసుకున్నా శరీరానికి మేలు కలుగుతుందని తెలిపింది. ఇక వేసవిలో డీహైడ్రేట్‌ అవ్వకుండా ఉండేందుకు అధిక మొత్తంలో నీరు, ఇతర పండ్ల రసాలు తాగాలని చాట్‌ జీపీటీ సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)