సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలను ఏకం చేస్తాం !

Telugu Lo Computer
0


వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. వీలైనన్ని పార్టీలను ఏకం చేసి రాబోయే రోజుల్లో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఖర్గే బుధవారం కలిసి సంపద్రింపులు జరిపారు. విపక్షాల ఐక్యత విషయంలో నితీష్ కుమార్ సైతం తమతో ఏకీభవించారని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు. విపక్ష నేతలతో జరిగిన సమావేశం చారిత్రాత్మకమని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా ఇది కీలక భేటీ అన్నారు. సైద్ధాంతిక పోరాటంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళతామని, వ్యవస్ధలపై జరిగే దాడులను ఐక్యంగా ప్రతిఘటిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ కీలక భేటీలో జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ భేటీలో నేతలు ప్రధానంగా చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితే బీజేపీని వంద సీట్లలోపు పరిమితం చేయవచ్చని బిహార్ సీఎం నితీష్ కుమార్ గతంలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)