ఆకాశాన్నంటిన ఇంటి అద్దెలు !

Telugu Lo Computer
0


దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చ్ త్రైమాసికంలో అద్దెలు భారీగానే పెరిగాయి. ఇండియా నంబర్-1 ప్రాపర్టీ సైట్ మ్యాజిక్ బ్రిక్స్ తాజా రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరుల్లో అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయని తెలిపింది. మార్కెట్లో నెలకొన్న డిమాండ్-సప్లై అంతరాల కారణంగా అద్దెల్లో స్థిరమైన పెరుగుదల ఇటీవల నెలల్లో నమోదైంది. ఐటీ హబ్ లు చెన్నై ( 14.3 శాతం ), బెంగళూరు ( 12.2శాతం ), హైదరాబాద్ ( 10.8 శాతం), పుణె ( 7.8 శాతం ) అద్దె డిమాండ్ లో అత్యధిక వృద్దిని నమోదు చేశాయి. హైదరాబాద్ లో చిన్న చిన్న కాలనీలుగా ఉన్న వాటి పేరు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. నగరంలో ఐటీ కంపెనీలు కూడా బాగానే ఉన్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, వంటి ప్రాంతాల్లో బోలెడన్నీ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక ఉద్యోగ నిమిత్తం అక్కడ ఉండేవారు వేలల్లో ఉంటారు. దీంతో అక్కడ సాధారణంగానే.. రియల్ ఎస్టేట్ ఒక రేంజ్ లో ఉంటుందని ఊహించుకోవచ్చు. ఐటీ ఉద్యోగుల వేతతనాల ఆరంకెల్లో ఉంటుండటం..జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో.. ఇంటి అద్దెల కోసం కూడా ఎంతైన ఖర్చు పెడతారు. ఇక ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలు బాగా నడుస్తున్న నగరాల్లో.. ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ వెల్లడించింది. హైదరాబాద్ లోని కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి సహా.. బెంగళూరులోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఏడాది వ్యవధిలోనే రెంట్లు భారీగా పెరిగాయని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలకు నెలవైన హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో చూస్తే గనుక.. కొండాపూర్ లో సంవత్సరం కాలంలో 12శాతం, గచ్చిబౌలిలో 11 శాతం చొప్పున ఇంటి అద్దెలు పెరిగినట్లు తెలిపింది. మరోవైపు బెంగళూరు ఉత్తర, తూర్పు ప్రాంతా్లో చూస్తే ఏడాది కాలవ్యవధిలోనే 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దే ఏకంగా 24శాతం వరకు పెరిగిందని తాజా నివేదికలో వెల్లడైంది. 2022 మొదటి క్వార్టర్ లో ఇక్కడ అద్దె రూ. 21 వేలుగా ఉండగా.. తాజాగా అది రూ. 26 వేలకు పెరిగింది. ఇంకా మన దేశంలోని పలు మహా నగరాల్లో చూస్తే గనుక.. అద్దె భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. అందులో తొలి స్థానంలో బెంగళూరు నిలిచిందని చెప్పుకొవచ్చు. ఇక నివాస స్థిరాస్తులపై ప్రతిఫలం చూస్తే మాత్రం బెంగళూరులో 4.1 శాతం, ముంబయిలో 3.9 శాతం ఉన్నట్లు అనరాక్ సంస్థ వెల్లడించింది. అదే విధంగా చెన్నైలో ప్రాంతాన్న బట్టి అద్దె రేట్లలో పెద్దగా వ్యత్యాసం ఉంది. 10-16 శాతం వరకు పెరిగినట్లు ఉంది. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చూస్తే.. NCR ఏరియాలో 10-15 శాతం వరకు.. ముంబయిలో 14-17 శాతం వరకు, కోల్ కతాలో మాత్రం 10-13 శాతం వరకు అద్దెలు పెరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)