తులిప్‌ గార్డెన్‌కు పర్యాటకుల తాకిడి !

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్ లో రంగురంగు విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను అధికారులు మార్చి  19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించారు. గతేడాది సుమారు 3.62 లక్షల మంది తులిప్ పూలను చూశారు. కాగా.. ఈ ఏడాది గార్డెన్ ను సందర్శించిన పర్యాటకుల్లో 3 లక్షలకుపైగా పర్యాటకులు జమ్ము కశ్మీర్ వెలుపల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరిలో 3125 మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. శ్రీనగర్ లోని తులిప్ తోట ఆసియాలోనే అతి పెద్దది.. ప్రకృతి అందాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ తులిప్ తోట. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది టూరిస్టులు శ్రీనగర్ కు క్యూ కడుతుంటారు. దేశ, విదేశాల నుంచి భారీగా తరలివస్తుంటారు. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసించే సీజన్ లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గెర్డెన్ ను అధికారులు తెరుస్తుంటారు. ఈ ఏడాది మార్చి 19 నుంచి గార్డున్ లోకి సందర్శకులను అనుమతించారు. ఏప్రిల్ 20న మూసివేశారు. ఈ పూల గార్డెన్ ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతో పాటు చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్ కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్స్ ఉన్నాయి. అయితే శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు ఏకంగా 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. అయితే తులిప్ గార్డెన్ కు అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను సృష్టించాలనేదే తమ లక్ష్యమని గార్డెన్ ఇన్ ఛార్జ్ అన్నారు. ఈ సంవత్సరం థాయ్ లాండ్, అమెరికా, అర్జెంటినా, యూరోపియన్ దేశాల నుంచి పర్యాటకులు వచ్చారని వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)