జార్ఖండ్ మంత్రి వీడియో కాల్ పై రగడ !

Telugu Lo Computer
0


జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జార్ఖాండ్ మంత్రి ఒకరు ఓ మహిళతో వీడియా కాల్ ద్వారా అసభ్య సంభాషణ జరిపినట్లుగా వెలుగు చూడటం సంచలనం రేపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేత రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా ఫోన్ లో ఓ మహిళతో మాట్లాడారు. వారిద్దరు మధ్య అసభ్యకరమైన సంభాషణ జరిగినట్లుగా నెట్టింట వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. కాంగ్రెస్ స్వభావం ఇదేనని.. ఇది జార్ఖాండ్ మంత్రి తీరు అని, మహిళల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ ఇందుకు సంబంధించి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది నిజమైతే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై మంత్రి బన్నా వివరణ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేయడంలో భాగంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఎడిట్ చేసిన వీడియో అని క్లియర్ గా అర్థమవుతుందని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి బన్నా చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)