కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో విడుదల

Telugu Lo Computer
0


కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో 16 ముఖ్యమైన హామీలను బీజేపీ పొందుపరిచింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని ప్రకటించింది. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని తెలిపింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)