నెట్టింట వైరల్‌గా మారిన యువకుడి పాట !

Telugu Lo Computer
0


బీహార్‌ యువకుడు అమర్జీత్ జైకర్ తాజాగా హిమేష్ రేషమ్మియ కంపోజ్ చేసిన న్యూ ట్రాక్‌ను ఆలపించాడు. దిల్ దే దియా హై పాట పాడిన జైకర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. సోనూ సూద్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలను ఆ వీడియో ఆకట్టుకుంది. ఇక హిమేష్ రేషమ్మియ రాసి, కంపోజ్ చేసిన లేటెస్ట్ ట్రాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ పాట వీడియో ఇప్పటివరకూ 30,000కుపైగా వ్యూస్ రాబట్టింది. నెటిజన్లు అమర్జీత్ జైకర్ సింగింగ్ ట్యాలెంట్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సమస్తీపూర్ అమర్జీత్ స్వస్ధలం. ఇక అమర్జీత్ ఫిర్ భీ తుమ్కో చాహుంగా సాంగ్‌ను ఆలపించిన వీడియోను సినీ దర్శకుడు వినోద్ కాప్రి షేర్ చేశాడు. 2020లో విడుదలైన హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూవీలోని ఈ సాంగ్‌ను ఇటుకలు పేర్చుతూ అమర్జీత్ శ్రావ్యంగా పాడటం నెటిజన్లను అలరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)