సరిహద్దులో సాధారణ స్థిరత్వం : జనరల్‌ లీ షాంగ్‌ఫు

Telugu Lo Computer
0


భారత్‌-చైనా సరిహద్దులో ప్రస్తుతం సాధారణ స్థిరత్వం నెలకొని ఉందని చైనా విదేశాంగ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫు చెప్పారు. ఇరు దేశాల సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్‌ కొనసాగిస్తున్నాయని వివరించారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన లీ షాంగ్‌ఫు భారత విదేశాంగ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌-చైనా సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితి, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఉన్న మొత్తం ఆధారం చెరిగిపోతుందని చైనాకు రాజ్‌నాథ్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. సరిహద్దుకు సంబంధించిన ఏ వివాదమైనా ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో జనరల్‌ లీ షాంగ్‌ఫు ఆచితూచి స్పందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)