దసరా చిత్రంపై అంగన్ వాడీ కార్యకర్తలు ధర్నా! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 2 April 2023

దసరా చిత్రంపై అంగన్ వాడీ కార్యకర్తలు ధర్నా!


టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన ఆయన నూతన దర్శకులను పరిచయం చేస్తున్నాడు. నిర్మాతగా గతేడాది హిట్ 2 సినిమాతో మంచి హిట్టు కొట్టాడు. తాజాగా హీరోగా దసరా మూవీతో మరో హిట్ కొట్టాడు. ఇందులో ధరణిగా పాత్రలో కనిపించిన నాని మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో వెన్నెల అనే పాత్రలో అదరగొట్టింది. శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించారు. దసరా సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 3న విడుదల చేశారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రగ్గడ్ లుక్ లో కనిపించగా మరో హీరోగా దీక్షిత్ ఆకట్టుకున్నాడు. తెలంగాణలోని సింగరేణి ఏరియా కథతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. మార్చి 30న పాన్ ఇండియా చిత్రంగా వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఫలితంగా మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తోంది.  ఈ సినిమాలో తమను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించడంతోపాటు దసరా చిత్ర బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ తదితర చోట్ల థియేటర్ల ముందు  అంగన్ వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే అంగన్ వాడీ టీచర్ పాత్ర పోషించింది. ఇందులో ఒకానొక సమయంలో పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను వెన్నెల అనే పాత్ర అమ్ముకుంటుంది. అంతేకాకుండా, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇస్తుంది. ఇప్పుడు ఈ సన్నివేశాల మీద అంగన్ వాడీ కార్యకర్తలు అభ్యంతరం తెలియజేస్తూ ధర్నాకు దిగారు.

No comments:

Post a Comment