ఒక డాలర్‌కు పర్స్ కొంటే రూ.7.8 లక్షలకు అమ్ముడైయింది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 2 April 2023

ఒక డాలర్‌కు పర్స్ కొంటే రూ.7.8 లక్షలకు అమ్ముడైయింది !


ఒక డాలర్‌తో పర్స్ కొన్న 29 ఏళ్ల చాండ్లర్ వెస్ట్‌ పర్స్ పై కొన్ని మెరుస్తున్న రాళ్లను చూసిన చాండ్లర్ వెస్ట్‌ మొదట ఏ విషయం అర్ధం కాలేదు. అయితే ఆ పర్స్ మీద ఉన్న రాయి వజ్రమని తెలుసుకున్న ఆమె షాక్ తింది. ఆ తర్వాత పర్స్ ను వేలం వేసింది. ఇదే విషయంపై చాండ్లర్ వెస్ట్‌ ఓ ప్రముఖ వార్త ప్రత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఈ పర్స్ ను కొన్న సమయంలో అది చాలా పాతదిగా కనిపించింది. అంతేకాదు అది చాలా చౌకగా దొరకడంతో వెంటనే కొనుగోలు చేసినట్లు చెప్పింది. ఇంటికి పర్స్ తీసుకుని వచ్చిన తర్వాత తన మనసులో ఉత్సుకత ఏర్పడింది. అంతేకాదు పర్సు చిత్రాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినట్లు చెప్పింది. పురాతన వస్తువుల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆ పర్స్ గురించి చాండ్లర్ వెస్ట్‌ కు చెప్పారు. ఈ పర్స్ 1920 సంవత్సరంలో తయారు చేసిన లగ్జరీ ఫ్రెంచ్ బ్రాండ్ కార్టియర్ పర్స్ అని చెప్పారు. ఆ పర్స్ మీద ఉన్న మెరిసే రాయికి చాలామంది ఆకర్షితులయ్యారు. ఆ పర్స్ ను నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.  చాండ్లర్ తన పర్స్ ను నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్లింది. అయితే పర్స్ మీద ఉన్న మెరిసే రాళ్ళు నిజమైన వజ్రాలే అని అప్పుడు ఆమెకు తెలిసింది. వాటి విలువ మార్కెట్ లో $ 4,000 కంటే ఎక్కువ ధర ఉంటాయని తెలిసింది. అనంతరం చాండ్లర్ తన పర్స్ ను వేలం వేయగా దాని ధర 9,450 డాలర్లు పలికింది. మన దేశ కరెన్సీలో దాదాపు రూ.7.8 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఒక డాలర్ కు కొన్న పర్స్ తో ఆమె లక్షాధికారిణి అయింది.

No comments:

Post a Comment