అఫ్తాబ్ పూనావాలాపై తోటి ఖైదీలు దాడి !

Telugu Lo Computer
0


అఫ్తాబ్ పూనావాలాను సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్‌పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. కాగా శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్‌గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)