ఎస్సీఓ సమావేశానికి భారత్ రానున్న చైనా రక్షణ మంత్రి

Telugu Lo Computer
0


షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశం వచ్చే వారం భారత్‌లో జరగనుంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి చైనా రక్షణ మంత్రి లీషాంగ్‌ఫూ హాజరుకానున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తరువాత చైనా రక్షణ మంత్రి భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, ఆఫ్గానిస్థాన్‌లోని భద్రతా పరిస్థితి వంటి అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ మీటింగ్ కు చైనా ఢిఫెన్స్ మినిస్టర్ తోపాటు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయగులు కూడా పర్యటించనున్నారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ను కూడా ఆహ్వానించారు. ఓవైపు ఇండియా, చైనా మధ్య ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా రక్షణ మంత్రి భారత్‌ను సందర్శించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోనుంది. లాస్ట్ ఇయర్ కూడా తవాంగ్‌ సెక్టార్‌లో యాంగత్సే వద్ద భారత్‌-చైనా దళాలు గొడవ పడ్డ సంగతి తెలిసిందే. మరోవైపు రష్యా రక్షణ మంత్రి షోయిగు ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఇండియాకు రానున్నారు. వచ్చే నెల 5న గోవాలో ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. దీనికి పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)