మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ స్కీం ప్రారంభం !

Telugu Lo Computer
0


ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మహిళా సమ్మాన సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పేరిట మహిళలు, బాలికలకు స్పెషల్‌గా కొత్త చిన్న మొత్తాల పథకాన్ని 2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో శనివారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. దేశంలోని 1.59 లక్షల పోస్టాఫీసుల్లోనూ ఈ పథకాన్ని మహిళలు, బాలికల కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లను మహిళలు గానీ, బాలికల పేరుపై గానీ తీసుకునేందుకు వీలు ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 7.50 శాతం వడ్డీరేటు ఇస్తున్నట్లు తెలిపింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. ఇప్పటికైతే ఈ పథకం పోస్టాఫీసులకే పరిమితం చేశారు. బ్యాంకుల్లో ఎప్పటి నుంచి అమలవుతుందో వెల్లడించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)