పాన్ కార్డుతో తస్మాత్ జాగ్రత్త !

Telugu Lo Computer
0


రాజస్తాన్‌లోని భిల్వారా ప్రాంతంలో 12.23 కోట్ల లావాదేవీకి సంబంధించి వికలాంగ స్టేషనరీ దుకాణదారుడికి ఆదాయపు పన్ను నోటీసు జారీ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుకాణదారుడు అంత మొత్తంలో లావాదేవీలేమీ చేయలేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఎందుకు పంపింది ? దీని వెనుక కారణం ఏమిటో అతనికి తెలియలేదు. కిషన్ గోపాల్ చాపర్వాల్ నోటీసును మళ్లీ మళ్లీ చదివినప్పుడు, తన పేరు మీద నోటీసు జారీ చేసినట్లు వచ్చినది నిజమేనని గ్రహించాడు. అనంతరం ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. అప్పుడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ మీడియా సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌లోని భిల్వారాలోని సంజయ్‌నగర్‌లో నివసిస్తున్న 38 ఏళ్ల కిషన్ గోపాల్ చపర్వాల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లగా, పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని.. ముంబై, సూరత్‌లోని రెండు డైమండ్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని చెప్పాడు. ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మార్పిడి జరిగింది. కిషన్ చాపర్వాల్ షాపు ప్రారంభించడానికి అప్పు తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ రుణం చెల్లించడంలో సమస్య ఏర్పడింది. తనకు దుకాణంలో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. చేతిలో ఏమీ మిగలడం లేదు. కాబట్టి ఇన్ని కోట్లతో తనకు ఏ సంబంధం లేదని… నకిలీ కంపెనీలు పెట్టి పాన్ కార్డు ద్వారా మోసపోయానని వాపోయాడు. ఈ లావాదేవీకి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కిషన్ గోపాల్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. అలాగే, 12.23 కోట్ల లావాదేవీల విషయంలో వివరాలను సమర్పించాలని కోరింది. పాన్ కార్డును ఎవరు వాడుతున్నారో తనకు తెలియదన్నారు. అలాగే, ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కిషన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సుభాష్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)