ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సురక్షితం !

Telugu Lo Computer
0


దేశంలో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు పేమెంట్స్ బ్యాంకులు ప్రస్తుతం దేశంలో సేవలు అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, ప్రజలకు మధ్య వారధిలా ఇవి పనిచేస్తున్నాయి. అయితే దేశంలో మూడు బ్యాంకులు అత్యంత సురక్షితమైనవని ఆర్బీఐ చెబుతోంది. ఈ బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ దివాలా తీయబోవని తేల్చింది. 'బ్యాంకులు దివాలా తీశాయి' అనే పదం మనం తరచూ వింటుంటాం. సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడం, ఆర్థిక ప్రణాళికలు సఫలం కాకపోవడంతో చాలా బ్యాంకులు చేతులెత్తేస్తుంటాయి. ఫలితంగా నాన్ ప్రాఫిట్ అసెట్స్ పెరిగి మూతపడే స్థితికి చేరుకుంటాయి. ఇలాంటి వాటికి జీవం పోసేదే ఆర్బీఐ. దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని పర్యవేక్షించే బాధ్యత ఆర్బీఐపై ఉంటుంది. అందుకే బ్యాంకుల ఆర్థిక పరిస్థితి చేయి దాటిపోతే ఈ సంస్థ తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ విషయంలో మాత్రం ఆర్బీఐ ధీమాతో ఉంది. ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంకు కాగా, మిగతా రెండు ప్రైవేటు బ్యాంకులు. వీటి నిర్వహణ తీరు మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. డొమెస్టిక్ సిస్టమెటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ లిస్టును ఇటీవల ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల పేర్లు ఉన్నాయి. ఈ బ్యాంకులు పతనం కావడం దాదాపు అసాధ్యం అంటూ ఆర్బీఐ చెప్పుకొచ్చింది. బ్యాంకుల పనితీరు, పురోగతి కారణంగా ఈ లిస్టులోకి చేర్చినట్లు సంస్థ వెల్లడించింది. ఏదైనా సంక్షోభం తలెత్తితే ప్రభుత్వం వీటికి సహకరిస్తుంది. పతనం కాకుండా అడ్డుకుని తోడ్పాటు అందిస్తుంది. అందువల్లే ఫండింగ్ మార్కెట్‌లో ఈ బ్యాంకులు అదనపు వెసులుబాట్లను కలిగి ఉంటాయి. మరోవైపు, కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)