నాపై కుట్ర జరుగుతుందన్న రాజా సింగ్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 2 April 2023

నాపై కుట్ర జరుగుతుందన్న రాజా సింగ్ !


బీజేపీ నుంచి సస్పెండైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభయాత్రలో రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్‌గంజ్ ఎస్ఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు రాజా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ క్రమంలో రాజా సింగ్‌పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై కేసులు నమోదు చేయడంపై రాజా సింగ్ స్పందించారు. శ్రీరామనవమి శోభయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి తనను మళ్లీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని రాజా సింగ్ ఆరోపించారు. ధర్మం గురించి, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా? పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు. 

No comments:

Post a Comment