పీఎస్‌ఎల్‌వీ సీ-55 ప్రయోగానికి ఇస్రో సిద్ధం !

Telugu Lo Computer
0


ఈ నెల 22న సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-55 ప్రయోగం చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)  సిద్ధం అవుతోంది.  షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్‌ భవనంలో పీఎస్‌ఎల్‌వీ మొదటి, రెండు దశలు రాకెట్‌ అనుసంధానం ఇప్పటికే పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. సింగపూర్ దేశానికి చెందిన టెలియోస్-2, లూమి లైట్-4 ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇది పూర్తి విదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కమర్షియల్ ఉపగ్రహం.. సింగపూర్ దేశానికి భూ పరిశీలనకు ఉపయోగపడనున్నాయి ఈ ఉపగ్రహాలు.. ఇక, ప్రయోగానికి 25 గంటల 30 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలు కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)