దేశంలో కొత్తగా 5,353 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 5,353 కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 25,587 చేరింది. కేరళలో అత్యధికంగా కోవిడ్‌ కేసులు వెలుగు చూడగా, ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఆరుగురు కరోనాతో కన్నుమూశారు. కరోనా నుంచి గత 24 గంటల్లో 2,826 మంది కోలుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియెంట్‌ కారణాంగానే వైరస్‌ విజృంభిస్తోందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ‍రాబోయే రోజుల్లో వైరస్‌ విజృంభణ ఉంటుందని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకూ సూచించింది. మరోవైపు ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు మాక్‌డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)