2025 నాటికి 10 వేల కిలోమీటర్ల డిజిటల్‌ హైవేలు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో 'డిజిటల్‌ హైవే'ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. 2024-25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఎన్‌హెచ్‌ఏఐలో భాగమైన నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్‌ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్‌ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)