బ్రెయిన్ ట్యూమర్ - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


బ్రెయిన్‌లో వస్తే మాత్రం చాలా ఇబ్బందికరం. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. సాధారణంగా ఈ ట్యూమర్స్ వంశపారంపర్య వ్యాధులు, జీన్స్, అయోనైజింగ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వంటి కారణాల వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటితో పాటు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడితే బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ నుంచి విడుదల అయ్యే రేడియేషన్ కారణంగా ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే ఫోన్ మాట్లాడటం తగ్గించాలని, ఒకవేళ మాట్లాడినా సాధ్యమైనంత వరకు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. మనం అనుసరించే జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు కారణాలవుతాయి. అధికంగా కొవ్వు పదార్థాలు తినడం వల్ల ట్యూమర్ ముప్పు పెరుగుతుంది. స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. పురుగుమందులు, పారిశ్రామిక రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అవ్వడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా కెమికల్‌ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి, పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో నివసించే వారికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ సమస్యకు హర్మోన్లు కూడా కారణం అని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయించుకున్న వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. నియంత్రణ అనేదే లేకుండా, అసాధారణంగా కణాలు పెరిగిపోవటాన్ని ట్యూమర్‌ అంటారు. కణాలన్నీ ఒక ముద్దలా, కాయలా తయారవుతాయి. సాధారణంగా మన శరీరంలోని కణాలు ఒక దశకు వచ్చాక చనిపోతాయి, వీటిని భర్తీ చేయటానికి కొత్త కణాలు పుడతాయి. కొన్నిసార్లు పాత, దెబ్బతిన్న కణాలు మరణించకపోయినా వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇవే ఒకదగ్గర పోగుపడుతూ చివరికి ట్యూమర్‌లా మారతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)