కారులోంచి నోట్ల కట్టలు విసిరిన యువకులు !

Telugu Lo Computer
0


ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో కారులో ప్రయాణిస్తూ ఓ యువకుడు నోట్ల కట్టలు విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాలో ఇలాంటి తరహా దృశ్యాన్ని కాపీ కొడుతూ గురుగ్రామ్‌ గోల్ఫ్ కోర్స్ రోడ్‌ లో అచ్చం అలాగే నోట్ల కట్టలు విసురుతూ కారులో వెళ్లిన యువకులను పోలీసులు గుర్తించారు. ఫర్జీ అనే వెబ్ సిరీస్‌లోనూ ఇలాంటి దృశ్యమే ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఓ యువకుడు కారు నడుపుతుండగా, మరో యువకుడు ముఖానికి మాస్క్ పెట్టుకుని నోట్ల కట్టలు విసిరాడు. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రధాన నిందితుడిని గుర్తించామని గురుగ్రామ్ ఏసీపీ వికాస్ కౌశిక్ తెలిపారు. ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. పాపులారిటీ కోసమే యువకులు ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)