బ్యాంకు దోపిడీకి విఫల యత్నం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి ప్రయత్నం చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం బ్యాంకు సమయంలో బ్యాంకు సిబ్బంది బ్యాంకుకు వెల్లగా చోరీ ప్రయత్నం జరిగిన సంఘటనను పోలీసులకు బ్యాంకు మేనేజర్ అవినాష్ పిర్యాధు చేయడంతో కాటారం సిఐ రంజిత్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మంగళవారం రాత్రి సమీపంలోని వెల్డింగ్ షాప్ లో గ్యాస్‌ కట్టర్ ని దొంగతనం చేసుకొచ్చి రాత్రి సుమారు 12.30 గంటలకు బ్యాంక్ చిన్న గేటును గ్యాస్‌ కట్టర్ సహాయంతో తొలగించి లోపలికి వెళ్లి బ్యాంకులోకి వెళ్లేందుకు కిటికిని తొలగించే సమయంలో విఫలమై దొంగలు పారిపోయినట్లు తెలుస్తుంది. దొంగలు మంకీ క్యాపులు వాడినట్లు సిసి కెమరాలో తెలుస్తుంది. బ్యాంకు ముందు ఉన్న సిసి కెమెరాల వెనక భాగం పగల కొట్టారు. వెల్డింగ్ షాప్ లో గ్యాస్ దొంగతనం జరుగగా బుధవారం ఉగాది పండుగ రోజు షాపు యజమాని సారయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది కావున సెలవు దినం కావడంతో  గురువారం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కుక్కలు, ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసు స్టేషన్ 200 మీటర్ల సమీపంలో ఉన్నబ్యాంకులో దోపిడీకి ప్రయత్నం జరగడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)