డాలరు స్థానంలో రూపాయితో వ్యాపారం !

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇప్పుడు రూపాయితో వ్యాపార లావాదేవీలకు ఆస్కారం ఏర్పడింది. రూపాయి విలువ డాలరు స్థాయికి చేరుకుంటోంది. అనేక దేశాలు కూడా ప్రాపంచిక వ్యాపారంలో డీడాలరైజ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు భారత రూపాయి కరెన్సీలో వ్యాపారం చేయడానికి ఆమోదం తెలుపుతున్నాయి. ఇప్పుడు భారత రిజర్వు బ్యాంకు రష్యా, శ్రీలంక సహా 18 దేశాలలో 60 స్పెషల్ రూపీ వోస్ట్రో ఖాతాలు తెరువడానికి ఆమోదం తెలిపింది. భారత ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరద్ పార్లమెంట్‌కు ఈ విషయాన్ని తెలిపారు. 'దేశీయ, విదేశీ అధీకృత డీలర్ (ఏడి) బ్యాంకులు 18 దేశాలలో భారతీయ రూపాయల్లో చెల్లింపులు చేయడానికి బ్యాంకుల ఎస్‌ఆర్‌విఎలను తెరువడానికి భారతీయ రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది' అని ఆయన పార్లమెంటుకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)