'కేజిఎఫ్' సెట్ లో యష్ నన్ను వేధించాడు అనడం పచ్చి అబద్దం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 March 2023

'కేజిఎఫ్' సెట్ లో యష్ నన్ను వేధించాడు అనడం పచ్చి అబద్దం


'కేజిఎఫ్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా తరువాత విక్రమ్ సరసన కోబ్రాలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. సినిమాల్లో కన్నా శ్రీనిధి సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక తన మీద ఏమైనా ట్రోల్స్ వచ్చినా.. ఫేక్ న్యూస్ వచ్చినా దానిని ఖండిస్తూ ఉంటుంది. తాజాగా కెజిఎఫ్ హీరో యష్ తనను వేధించాడు అంటూ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు వేసిన ట్వీట్ ను ఖండించడమే కాకుండా యష్ ఎలాంటివాడో చెప్పుకొచ్చింది. సెన్సార్ సభ్యుడుని అని చెప్పుకుంటూ తిరిగే ఉమైర్ సంధు రెండు రోజుల క్రితం శ్రీనిధి ఫోటో పెట్టి ఆమె చెప్పినట్లుగా ఒక స్టేట్మెంట్ చెప్పుకొచ్చాడు. ' 'కేజిఎఫ్' సెట్ లో యష్ నన్ను వేధించాడు. అతడితో ఇంకెప్పుడు పనిచేయాలనుకోవడం లేదు. అతనితో యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అతను ఒక టాక్సిక్ వేధించే మనిషి' అని రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై శ్రీనిధి స్పందించింది. ఆ ట్వీట్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. ' సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. మిగతావారి మీద బురద చల్లడానికి సోషల్ మీడియాను సాధనంగా మార్చుకుంటున్నారు. ఆలాంటి వారికి కూడా నేను ప్రేమను అందిస్తున్నాను. నా జీవితంలో ముఖ్యమైన వారికి నా ప్రగాఢమైన ప్రశంసలను తెలియజేయడానికి ఉపయోగించాలనుకుంటున్నాను. ఇక ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి ప్రమాదకరమైన వార్తలు పునరావృతం కాకుండా మరోసారి గట్టిగా చెప్తున్నాను. నేను 'కేజిఎఫ్' లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి పనిచేయడం నిజంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. జెంటిల్ మ్యాన్, నా గురువు, నా స్నేహితుడు, నా ఇన్స్పిరేషన్. రాకింగ్ స్టార్ యష్ నేను మీకు ఎప్పటికీ పెద్ద ఫ్యాన్ నే' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ ఉమైర్ సంధును ఏకిపారేస్తున్నారు. 

No comments:

Post a Comment