పరిగి నుంచి తిరుపతి బస్సు

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిగి నుండి పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గతంలో పలుమార్లు ప్రజలు, నేతలు  అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇటీవల పరిగికి వచ్చిన ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తం దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సత్వరం స్పందించిన ఆయన రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ను, డిపో మేనేజర్‌ పవిత్రను పరిశీలించాలని ఆదేశించారు. ఎట్టకేలకు బస్సు నడిపేందుకు ప్రకటించారు. తిరుపతికి బస్సును ప్రారంభిస్తున్నట్లు అధికారులు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. మొదట పెద్దగా స్పందన రాకున్నా క్రమక్రమంగా రిజర్వేషన్‌ చేసుకున్న వారి సంఖ్య వందకు పైగా చేరడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ప్రయాణికుల సంఖ్య 108కి చేరింది. అధికారులు వెంటనే పికెట్‌ డిపో నుంచి మూడు సూపర్‌ లగ్జరీ బస్సులను తెప్పించారు. మార్చి 6న ఉదయం వీటిని ఆర్‌ఎం శ్రీధర్‌, డిప్యూటీ రీజనల్‌ రాజు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)