క్రీడాకారుల జీవితం చిన్న పక్షిలాంటిది !

Telugu Lo Computer
0


ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నిజం విత్‌ స్మిత' కార్యక్రమంలో నటుడు సుధీర్‌బాబు, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాల్గొన్నారు. తమ కెరీర్‌, ఎదురుదెబ్బల నుండి పలు ఆసక్తికర అంశాలను వీరిద్దరూ పంచుకున్నారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో గురువారం విడుదలైంది. తన వద్ద శిక్షణ పొంది.. పేరుపొందిన టోర్నమెంట్స్‌లో విజేతలుగా నిలిచిన పలువురు క్రీడాకారులు అకాడమీ వదిలి వెళ్లిపోవడంపై గోపీచంద్‌ ఈ వేదికపై స్పందించారు. ''క్రీడాకారుల జీవితం చిన్న పక్షిలాంటిది. మనం గట్టిగా పట్టుకుంటే అది చచ్చిపోతుంది. అలా కాకుండా సున్నితంగా వదిలేస్తే అది ఎక్కడికైనా ఎగిరిపోతుంది. ఇక్కడ వాటిని జాగ్రత్తగా పట్టుకోవడమే నీ ఉద్యోగం. అలా అయినప్పుడే అవి ఇబ్బందిపడకుండా, ఎక్కడికి ఎగిరిపోకుండా ఉంటాయి'' అని గోపీచంద్‌  వెల్లడించారు. అనంతరం సుధీర్‌బాబు ధ్యానం చేయడం పై మాట్లాడుతూ.. ''ఇప్పటికీ నేను దాన్ని ఎందుకు చేయలేకపోతున్నా అని ఆశ్చర్యపోతుంటా. పెళ్లి అనేది ఒక కారణమై ఉండొచ్చు'' అని నవ్వులు పూయించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)