అర్షద్ వార్సీపై సెబీ నిషేధం

Telugu Lo Computer
0


స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియా గొరేటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) కొరడా ఝుళిపించింది. స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో పాలు పంచుకోకుండా అర్షద్ వార్సీ, ఆయన భార్యతోపాటు మరో 45 మందిని సెబీ నిషేధించింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే అర్షద్ వార్సీ, ఆయన భార్య మరికొందరు రెండు కంపెనీలకు సంబంధించిన ధర విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు. షార్ప్‌లైన్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్, సాద్నా బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ కంపెనీల ధర విషయంలో ఉద్దేశపూర్వకంగా కొన్ని వీడియోలను యూట్యూబ్‌ ఛానెల్స్‌లో అప్ లోడ్ చేసి తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేసింది. షార్ప్ లైన్, సాద్నా కంపెనీలకంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. దాదాపు 54 కోట్ల మేర డబ్బును ఆర్జించారు. యూట్యూబ్‌లో వీడియోలను అప్ లోడ్ చేసి ఇన్వెస్టర్లను ప్రలోభాలకు గురిచేశారు అనే విషయాన్ని సెబీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. సెబీ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం.. అర్జద్ వార్సీ 29.43 లక్షలు, మారియా గోరెటీ 37.56 లక్షలు, ఇక్బాల్ హుస్సేన్ వార్సీ 9.34 లక్షలు లాభాలు పొందారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్వెస్టర్లను ప్రభావితం చేశారు. వీరి ప్రకటనల ప్రభావంతో భారీగా ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేశారు అని వెల్లడించింది. అర్షద్ వార్సీ, మారియా, ఇక్బాల్ హుస్సేన్ 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ధర పెంచేశారు. దానికి సంబంధించిన సమాచారాన్ని వీడియోల రూపంలో అప్ లోడ్ చేశారు. ఈ విషయాలపై వచ్చిన ఆరోపణలపై పరిశోధించాం. ఆ ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో మొత్తం 45 మందిపై నిషేధం విధించాం. వారు ఇక స్టాక్ మార్కెట్‌లో కొనుగోల్లు, అమ్మకాలు జరపకుండా నిషేధం విధించాం అని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించడమే కాకుండా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బును విత్ డ్రా చేయకుండా, అలాగే ఆస్తులు అమ్మకుండా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. సెబీ ఆదేశాలు లేకుండా ఆస్తులు అమ్మకూడదు, డబ్బు విత్ డ్రా చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)