హైదరాబాద్‌లోఆసియాలోనే అతి పెద్ద అమెరికన్‌ కాన్సులెట్ !

Telugu Lo Computer
0


ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్‌ కాన్సులెట్ నిర్మాణం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడలో జరిగింది. సుమారు రూ. 2800 కోట్లతో నిర్మాణం జరిగిన అమెరికన్‌ కాన్సులెట్‌ సేవలు మార్చి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల వారికి వీసా సౌకర్యాల కోసమే కాకుండా హైదరాబాద్‌లో అమెరికాకు ఉన్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విశాలమైన భవనాన్ని 12 ఎకరాల్లో నిర్మించారు. పెరుగుతున్న స్టూడెంట్ వీసా డిమాండ్ కు అనుకూలంగా కార్యాలయం స్థాపించాడానికి 2017 లోనే ఈ విశాలమైన బిల్డింగ్ నిర్మాణం చేపట్టింది. అమెరికా ప్రభుత్వము దానికి కావాల్సిన సదుపాయాలు, నిధులు కేటాయించింది. రెండు సంవత్సరాలు కోవిడ్‌ కారణంగా కష్టాలు అనుభవించినా చివరికి ఈ ఆధునిక కార్యాలయ పనులను ఆపకుండా మార్చి 20 న పైగా ప్యాలస్‌ నుంచి కార్యాలయాన్ని మార్చేసింది. ఇదిలా ఉంటే అమెరికా, భారత్‌ల మధ్య పటిష్ట వాణిజ్య బంధానికి హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ కీలక పాత్ర పోషిస్తోందని వాషింగ్టన్‌లో అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం ఎన్నో అమెరికన్‌ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.భారత్‌లో అమెరికా పెట్టుబడులే కాకుండా భారత్‌ నుంచి అమెరికాలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను ఈ కొత్త కాన్సులేట్‌ బిల్డింగ్‌ ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఇక మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. . హైదరాబాద్‌లో వాణిజ్యానికి సంబంధించి, ఈ కొత్త కాన్సులేట్ దోహదపడుతుందని మంత్రి ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)