బ్రిటన్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె !

Telugu Lo Computer
0


జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ లో జూనియర్ డాక్టర్లు మూడు రోజుల సమ్మె ప్రారంభించారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్టు తమ వేతనాలు లేవని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయ్యాయని, జీవన వ్యయం పెరిగిపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న స్టూడెంట్‌ రుణాలు ఎలా చెల్లించాలో దిక్కుతోచడం లేదని 28 ఏళ్ల ఓ జూనియర్‌ డాక్టర్‌ తన ఆవేదన వెళ్లగక్కాడు. కోవిడ్‌ -19 మహమ్మారి సమయంలో వరదలా పెషంట్స్‌ వచ్చారని ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా వారికి సేవలందించామని జూడాలు చెబుతున్నారు. తమ సేవలకు ప్రజల నుంచి ప్రశంసలందినా, తమ బిల్లులు వారు చెల్లించరు కదా. ప్రభుత్వ వైఖరికి విసిగిపోయిన జూనియన్‌ డాక్టర్లు నేటినుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఇప్పటికే రికార్డుస్థాయిలో పేషంట్స్‌ వెయిటింగ్‌ లిస్టు ఉంది. సమ్మెతో ఈ వెయిటింగ్‌ లిస్టు మరింత పెరిగిపోతుంది. చాలా మంది డాక్టర్లు తమ ప్రొపెషన్‌కు విలువ లేకుండా పోయిందని ఆవేదన వెళ్లగక్కారు. ట్రైనీలతో సహా దాదాపు 61,000 మంది జూనియర్ డాక్టర్లు జీతం 26 శాతం పెంచాలని కోరుతూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి 72 గంటలపాటు పనిని నిలిపివేస్తున్నారు. సాధారణంగా బ్రిటన్‌లో వారానికి 40 గంటల పాటు పనిచేస్తే ఏడాదికి 40వేల పౌండ్లు వేతనాలు లభిస్తోంది. అదనంగా వారానికి 48 గంటల పాటు పనిచేసి అదనంగా కొంత డబ్బు సంపాదించుకుంటున్నారు. వెస్ట్‌ లండన్‌లో ఫ్లాట్‌ అద్దె నెలకు 1,000 పౌండ్లు వరకు ఉంటోంది. ప్రస్తుతం అంత అద్దె చెల్లించలేక షేరింగ్‌ చేసుకోవాల్సి వస్తుందంటున్నారు జూనియర్‌ డాక్టర్లు. కరోనా సమయంలో తాము పని గంటలను పక్కనపెట్టి రాత్రింబవళ్లు రోగులకు సేవలందించామని, అయినా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)