వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌ కన్నుమూత

Telugu Lo Computer
0


ప్రముఖ సీనియర్‌ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌ (87) కన్నుమూశారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమా అనుభవాలను 'తెర వెనుక తెలుగు సినిమా' అనే పేరుతో పుస్తకం రచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది పురస్కారానికి ఎంపికైంది. పబ్లిసిటీ ఇంఛార్జ్‌గా పాపులర్‌ అయిన ఆయన దాదాపు 300 చిత్రాలకు పనిచేశారు. ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ వేడుకులు జరుపుకున్న చిత్రాలు ఉండటం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)