పెళ్లి చీర, మేకప్‌, నగలకే రూ.500 కోట్లు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 March 2023

పెళ్లి చీర, మేకప్‌, నగలకే రూ.500 కోట్లు !


కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. 50 వేల మందికి పైగా అతిథులు హాజరైన ఈ ఐదు రోజుల పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికల్లో ఎల్‌సిడి స్క్రీన్‌లు అమర్చిమరీ ఇచ్చాడు. పెళ్లి పత్రికగా ఇచ్చిన బాక్స్‌లో ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది. టేప్ విప్పగానే పాట ప్లే అవుతుంది. రెడ్డి కుటుంబం పెళ్లికి అతిథులుగా విచ్చేసిన వారి కోసం 40 విలాసవంతమైన ఎద్దుల బండ్లలో గేటుదాకా స్వాగతం పలికారు. శ్రీకృష్ణదేవరాయ విజయనగరం తరహాలో పెళ్లి మండపాన్ని బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు డిజైన్ చేశారు. విందు భోజన ప్రాంతం బళ్లారి గ్రామంలా డిజైన్ చేశారు. అతిథులను తరలించేందుకు దాదాపు 2000 క్యాబ్‌లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బెంగళూరులోని ఫైవ్, త్రీ స్టార్ హోటళ్లలో 1,500 విలాసవంతమైన గదులను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. వివాహ మండపంలో భద్రత కోసం ఏకంగా 3 వేలమంది పోలీసులను నియమించారు. మంత్రి జనార్ధన రెడ్డి కుటుంబ సభ్యులందరూ రాజుల వేషధారణలతో కోట్లాది రూపాయల విలువైన బంగారు, డైమండ్‌ నగలు ధరించి వచ్చారు. ఐదు రోజుల పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి ఏర్పాట్లే ఇంత బ్రహ్మాండంగా ఉంటే వధువు కోసం మరింత ప్రత్యేక ఏర్పాట్లు చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు. పెళ్లిలో బంగారు దారంతో నేసిన రూ.17 కోట్ల విలువైన కాంచీపురం పట్టుచీర వధువు బ్రాహ్మణి ధరించింది. ఆమె ధరించిన ఆభరణాల విలువ సుమారు రూ.90 కోట్లు. ముంబై నుంచి వచ్చిన స్పెషల్‌ మేకప్‌ ఆర్టిస్టులతో వధువును ముస్తాబు చేయడానికి రూ.30 లక్షలు ఖర్చుచేశారు. మంత్రిగారి కుమార్తె పెళ్లి సంగతులు గత ఏడేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా కథలు కథలుగా చర్చించుకుంటున్నారంటే ఇది ఆషామాషీ పెళ్లికాదన్నమాట.

No comments:

Post a Comment